మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sarva Devata Kruta Lalitha Stotram – శ్రీ లలితా స్తోత్రం (సర్వ దేవత కృతం)
ప్రాదుర్బభూవ పరమం తేజః పుంజమనూపమమ్ |
కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్ || 1 ||
తన్మధ్యమే సముదభూచ్చక్రాకారమనుత్తమమ్ |
తన్మధ్యమే మహాదేవిముదయార్కసమప్రభామ్ || 2 ||
జగదుజ్జీవనాకారాం బ్రహ్మవిష్ణుశివాత్మికామ్ |
సౌందర్యసారసీమాంతామానందరససాగరామ్ || 3 ||
జపాకుసుమసంకాశాం దాడిమీకుసుమాంబరామ్ |
సర్వాభరణసంయుక్తాం శృంగారైకరసాలయామ్ || 4 ||
కృపాతారంగితాపాంగ నయనాలోక కౌముదీమ్ |
పాశాంకుశేక్షుకోదండ పంచబాణలసత్కరామ్ || 5 ||
తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే స వాసవాః |
ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఽఖిలాత్మికామ్ || 6 ||
|| ఇతి శ్రీ లలితా స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.